Share News

CPI Leader Raja VS Amit Shah: న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షాపై సీపీఐ నేత రాజా ఫైర్

ABN , Publish Date - Aug 27 , 2025 | 03:44 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశానికి మంచి వాళ్లు కావాలని ఆకాంక్షించారు.

CPI Leader Raja VS Amit Shah: న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షాపై సీపీఐ నేత రాజా ఫైర్
CPI Leader Raja VS Amit Shah

ఢిల్లీ, ఆగస్టు27 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Vice President Election) చాలా కీలకమని సీపీఐ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (Raja) తెలిపారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి (Sudarshan Reddy) సీపీఐ పార్టీ తరపున మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. ఇవాళ(బుధవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో రాజా మాట్లాడారు. దేశంలో అత్యున్నత న్యాయకోవిధుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు.


రాజ్యాంగ పరిరక్షణ కోసం సుదర్శన్ రెడ్డి పని చేశారని ఉద్ఘాటించారు. దేశం ఇప్పుడు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తమ అభ్యర్థిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని.. ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఎంపీలు అందరూ ఆలోచించాలని, సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని సూచించారు.


కేంద్ర హోంమంత్రి అమిత్ షా (AmitShah) జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశానికి మంచి వాళ్లు కావాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవి చాలా కీలకమైనదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

అడవుల ద్వారా మయన్మార్‌కు భారత యువత.. సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రమంత్రి పెమ్మసాని

For AP News And Telugu News

Updated Date - Aug 27 , 2025 | 03:50 PM