Indians Rescued From Myanmar: అడవుల ద్వారా మయన్మార్‌కు భారత యువత.. సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రమంత్రి
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:41 PM
మయన్మార్ నుంచి 37 మంది భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని.. వారిలో ఏపీకి చెందిన నలుగురు తెలుగువారు కూడా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ముగ్గురు, రాజమండ్రికి చెందిన ఒకరు ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మయన్మార్ (Myanmar) నుంచి 37 మంది భారతీయులను (Indians) కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని, వారిలో ఏపీకి చెందిన నలుగురు తెలుగువారు కూడా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ముగ్గురు, రాజమండ్రికి చెందిన ఒకరు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ (బుధవారం) ఢిల్లీ వేదికగా పెమ్మసాని చంద్రశేఖర్ ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను ఏజెంట్లు మోసం చేశారని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. నిరుద్యోగులను మోసం చేసిన వారిలో ఏపీ నుంచి తెలుగు ఏజెంట్లు ఉండటం దురదృష్టకరమని తెలిపారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని థాయిలాండ్ తీసుకెళ్లి అక్కడి నుంచి రాత్రిపూట అడవుల ద్వారా మయన్మార్ తరలించారని వెల్లడించారు. అమెరికా, యూరప్ లాంటి దేశాల నుంచి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేలా యువతను చిత్రహింసలకు గురిచేశారని చెప్పుకొచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్.
కొంతమంది యువత బాధలు తట్టుకోలేక అక్కడే చనిపోయినట్లు తెలుస్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన విషయాలు వెల్లడించారు. ఉపాధి కోసం వెళ్లిన వారి పాస్ పోర్టులు తీసుకుని ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండి ఉండొచ్చు.. కానీ యువత క్లారిటీ లేకుండా ఎవరితో పడితే వారితో విదేశాలు వెళ్లకూడదని సూచించారు. పిల్లలను విదేశాలకు పంపించేటప్పుడు ఒకటికి పదిసార్లు తల్లిదండ్రులు ఎక్కడికి పంపిస్తున్నారో పరిశీలించుకోవాలని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల చేరుకున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న కాణిపాక క్షేత్రం..
For AP News And Telugu News