Cobra Bites Woman: మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిపోయి..
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:34 PM
Cobra Bites Woman: కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి మంత్రగాడ్ని ఆశ్రయించారు. ఆ మంత్రగాడు ఆమెను నేలపై పడుకోబెట్టి భూతవైద్యం చేయటం మొదలెట్టాడు.
టెక్నాలజీ పరంగా భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు మాత్రం తగ్గటం లేదు. మనిషి ప్రాణాలకు ముప్పని తెలిసినా కొంతమంది జనం మంత్రాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా, బిహార్ రాష్ట్రంలో ఓ ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పాము కరిచిన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి భూతవైద్యం చేయించారు కుటుంబసభ్యులు. 21వ శతాబ్ధంలోనూ ఎంతో క్రూరంగా ప్రవర్తించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రం సీతామర్హి ప్రాంతానికి చెందిన ఓ మహిళను పాము కరిచింది.
కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి మంత్రగాడ్ని ఆశ్రయించారు. ఆ మంత్రగాడు ఆమెను నేలపై పడుకోబెట్టి భూతవైద్యం చేయటం మొదలెట్టాడు. నాగు పామును ఆమె శరీరంపై వదిలాడు. అది పారిపోవడానికి ప్రయత్నిస్తున్నా వదల్లేదు. కర్రతో లాగి మరీ దాన్ని ఆమెపై వేయసాగాడు. ఈ భూత వైద్యాన్ని చూడ్డానికి పెద్దఎత్తున జనం అక్కడికి వచ్చారు. ఎంతో ఆసక్తిగా అక్కడ జరిగే దాన్ని చూస్తూ ఉండిపోయారు. పాపం ఆ మహిళ కదలకుండా మెదలకుండా అలానే ఉండిపోయింది. అయితే, ఆ మహిళ బతికుందా లేదా అన్నది తెలియరాలేదు.
ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ భూత వైద్యున్ని, కుటుంబసభ్యుల్ని తీసుకుని పోయి బొక్కలో వేయాలి'.. 'ఏం మనుషులు మీరు.. ‘ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతున్నారా?'.. మంత్రాలకు చింతకాయలు రాలతాయా?’.. ‘అయ్యో పాపం ఆమె చనిపోయినట్లు ఉంది, లేకపోతే కదిలేది’.. ‘21వ శతాబ్ధంలోనూ మూఢ నమ్మకాలను నమ్ముతున్నారంటే.. వీళ్లను ఏం చేయాలో తెలియటం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఉంగారానికి ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం..
55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ