Woman Gives Birth To 17th Child: 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ABN , Publish Date - Aug 27 , 2025 | 03:17 PM
Woman Gives Birth To 17th Child: వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. గిరిజన తెగకు చెందిన ఈ దంపతులు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతుంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ఇప్పటికే 16 మంది పిల్లలు ఉన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉదయ్‌పూర్‌లోని జండోల్‌కు చెందిన రేఖ,కవ్‌రా భార్యాభర్తలు. వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. గిరిజన తెగకు చెందిన ఈ దంపతులు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతుంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ఇప్పటికే 16 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు కొడుకులు, ఓ కూతురు పుట్టిన వెంటనే చనిపోయారు.
మిగిలిన వారిలో ఐదు మందికి పెళ్లిళ్లు అయి వారికి కూడా పిల్లలు ఉన్నారు. రేఖ మంగళవారం మరో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో స్థానికులు షాక్ అయ్యారు. కల్బేలియా ఫ్యామిలీ ఆర్థిక కష్టాల గురించి తెలిసిన వాళ్లు కోప్పడుతున్నారు. ఇక, తల్లి 17వ బిడ్డకు జన్మనివ్వటంపై కూతురు శిల్ప మాట్లాడుతూ.. ‘మేమందరమూ చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది. మా అమ్మకు 17 మంది పిల్లలని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు’ అని అంది. పిల్లల తండ్రి కవ్‌రా మాట్లాడుతూ..
‘మాకు సొంత ఇళ్లు లేదు. నేను 20 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి పిల్లలను సాకుతున్నాను. లక్షల రూపాయలు చెల్లించాను. కానీ, అప్పులు మాత్రం తీరటం లేదు. మేము చెత్త ఏరుకుని జీవనం సాగిస్తున్నాము. తినడానికి, పెళ్లిళ్లకు, చదువుకోవడానికి ఎలాంటి వనరులు లేవు’ అని అన్నారు. ఇక, రేఖకు డెలివరీ చేసిన డాక్టర్ మాట్లాడుతూ..‘ఇది తన నాలుగవ కాన్పు అని ఆమె చెప్పింది. అది తన 17వ బిడ్డ అని తర్వాత తెలిసింది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? డేటా లీక్‌తో జాగ్రత్త.. కేంద్రం వార్నింగ్..
వంటగది నుండి చెత్త వాసన వస్తోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..