Home » LSG
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూలోని అటల్ బిహారి వాజ్‌పేయ్ క్రికెట్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వానిందు హసరంగ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో హసరంగ స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జార్జ్ లిండేని ఎల్ఎస్‌జీ ఎంపిక చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు సంచలన విజయాన్ని అందించాడు 22 ఏళ్ల ముకుల్ చౌదరి. తాజాగా ముకుల్ తండ్రి దిలీప్ చౌదరి తన కొడుకు ఆడిన తీరుపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
కేకేఆర్ ఓపెనర్ ఫిల్ అలెన్ ఔటైన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ క్యాచ్ తీసుకునేటప్పుడు దిగ్వేశ్ బౌండరీ లైన్‌ను తాకినట్లు కేకేఆర్ అభిమానులు ఆరోపించారు. ఫీల్డ్ అంపైరే నిర్ణయం తీసుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. వీటిపై కేకేఆర్ ప్లేయర్ రోవ్‌మన్ పావెల్ మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చేసిన పనికి గ్యాలరీలో ఉన్న అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
క్రికెట్‌లో కొనసాగాలంటే ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందేనని టీమిండియా వెటరన్ బౌలర్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసి.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన ఎల్ఎస్‌జీ.. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్.. అభిమానులను నిరాశపర్చింది. ఇవాళ ఉప్పల్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
ఇవాళ(ఆదివారం)ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడుతోంది. ఐపీఎల్2026లో భాగంగా లఖ్‌నవూతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.
ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది.