ఐపీఎల్ 2026: లఖ్‌నవూ బోణీ.. హైదరాబాద్‌పై ఘన విజయం
ABN , Publish Date - Apr 05 , 2026 | 07:09 PM
ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన ఎల్ఎస్‌జీ.. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన ఎల్ఎస్‌జీ.. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ఇవాళ(ఆదివారం) ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. అనంతరం లఖ్‌నవూ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయం సాధించింది.
ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ ఎడెన్ మార్‌క్రమ్.. సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. 27 బంతుల్లో 45 పరుగులు చేసి.. శివాంగ్ కుమార్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. మిగిలిన బ్యాటర్లలో అబ్ధుల్ సమద్ 16, మిచెల్ మార్ష్ 14, ఆయుశ్ బదోని 12 పరుగులు చేశారు. ఎస్ఆర్ హెచ్ బౌలర్లలో హర్ష్ దూబె 2 వికెట్లు సాధించగా.. ఎషాన్ మలింగ, శివాంగ్ కుమార్ చెరో వికెట్ సాధించారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్
సెహ్వాగ్-గంభీర్‌లనే వెనక్కి నెట్టిన వైభవ్!