Share News

ఐపీఎల్ 2026: సెహ్వాగ్-గంభీర్‌లనే వెనక్కి నెట్టిన వైభవ్!

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:57 PM

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. భారత దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డును తాజాగా బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ 2026: సెహ్వాగ్-గంభీర్‌లనే వెనక్కి నెట్టిన వైభవ్!
Vaibhav Suryavanshi IPL 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL 2026) 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా భారత దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


నిన్న(శనివారం) గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఫోర్ బాదడం ద్వారా వైభవ్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆ బౌండరీతో సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్ జోడీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 500 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసిన ఓపెనింగ్ జోడీగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్-గౌతమ్ గంభీర్ జోడీ 309 బంతుల్లో 500 పరుగులు పూర్తి చేసింది.


తాజాగా వైభవ్, జైస్వాల్ జోడీ కేవలం 248 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకుంది. వీరిద్దరూ కలిసి పవర్ ప్లేను పూర్తిస్థాయిలో వాడుకుని 6.2 ఓవర్లలోనే 70 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓ టీనేజర్, ఓ యువ ఆటగాడు కలిసి సృష్టించిన ఈ రికార్డును భవిష్యత్తులో దిగ్గజ ఆటగాళ్లు కూడా అధిగమించడం కష్టమేనని క్రీడా నిపుణులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?

ఏడాది కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వీ..

Updated Date - Apr 05 , 2026 | 03:01 PM