Share News

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:55 PM

హైదరాబాద్ వేదికగా నేడు సన్‌రైజర్స్‌తో లఖ్‌నవూ జట్టు తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?
SRH vs LSJ

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నేటి 10వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ టీమ్ తలపడనుంది. ఈ పోరుకు హైదరాబాద్‌లోని ఉప్పల్(రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్) స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అంచనాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్న తరుణంలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం...


సన్‌రైజర్స్ హైదరాబద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ల మధ్య జరిగే మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఆట జరిగే సమయంలో 50 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత కూడా దాదాపుగా అలాగే ఉండే అవకాశముంది. ఎస్ఆర్‌హెచ్‌కు ఇది మూడో మ్యాచ్ కాగా.. ఎల్ఎస్‌జీకి రెండోది. లఖ్‌నవూ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. రిషభ్ పంత్ నాయకత్వంలోని ఆ జట్టు.. రాబోయే మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదుచేయాలని చూస్తోంది. ఇక ఎస్ఆర్‌హెచ్ విషయానికొస్తే.. ఆ జట్టు ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్ ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న పోరులో మరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత పైకి ఎగబాకాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది.


ఇవీ చదవండి:

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందనిదే..

ఏడాది కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వీ..

Updated Date - Apr 05 , 2026 | 12:55 PM