మత్తు పదార్థాలు సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారుగా..
ABN , Publish Date - Apr 05 , 2026 | 02:57 PM
హైదరాబాద్ మహానగరంలో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పార్టీపై రైడ్ చేసి మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుల్లో డీజే ప్లేయర్, వ్యాపారులతోపాటు ఓ మోడల్ కూడా ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఈగట్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్: మహానగరంలో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పార్టీపై రైడ్ చేసి మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుల్లో డీజే ప్లేయర్, వ్యాపారులతోపాటు ఓ మోడల్ కూడా ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఈగట్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. గోల్కొండలోని తారామతి బరదారిలో శనివారం అర్ధరాత్రి ఇంటర్నేషనల్ డీజే 'More Than Friends' పేరుతో పార్టీ జరిగిందని ఈగల్ టీమ్ తెలిపింది. ఆ డ్రగ్స్ పార్టీపై రైడ్ చేసినట్లు పేర్కొంది. గోల్కొండ పోలీసులు, ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ టీమ్స్ సంయుక్తంగా దాడులు చేసినట్లు వెల్లడించింది.
పార్టీలో మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు పార్టీపై రైడ్ చేసి 35 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో ఆరుగురికి పాజిటివ్‌గా వచ్చిందని.. వారిలో ఐదుగురు గంజాయి, ఒకరు అంఫెటమిన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యినట్లు ఈగల్ టీమ్ తెలిపింది. దీంతో వారిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించింది. అరెస్టయిన వారిలో డీజే ప్లేయర్, వ్యాపారులు, ఓ మోడల్ ఉన్నట్లు పేర్కొంది.
వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారని తెలిపింది. డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ టీమ్ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. మత్తుపదార్థాలు సేవించి యువత జీవితాలు నాశనం అవుతున్నాయని.. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థసారథి
టెర్రర్ లింక్స్ కేసు.. కేసులో బలం లేదన్న నిందితుల తరఫు న్యాయవాది..