టెర్రర్ లింక్స్ కేసు.. కేసులో బలం లేదన్న నిందితుల తరఫు న్యాయవాది..
ABN , Publish Date - Apr 05 , 2026 | 01:19 PM
ఉగ్రవాద సంస్థలకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ ఈ రోజు (ఆదివారం)తో ముగుస్తుంది. ఐదవ రోజు కస్టడీలో భాగంగా ఏటీఎస్, ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ అధికారులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఐదుగురిని విచారిస్తున్నారు.
అమరావతి, ఏప్రిల్ 5: ఉగ్రవాద సంస్థలకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్.. హైదరాబాద్‌కు చెందిన సయిదా బేగం.. బళ్లారికి చెందిన అబ్దుల్ సలాంలను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ ఈ రోజు (ఆదివారం)తో ముగుస్తుంది. ఐదవ రోజు కస్టడీలో భాగంగా ఏటీఎస్, ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ అధికారులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఐదుగురిని విచారిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిందితుల తరఫు న్యాయవాది సలీం మాట్లాడుతూ.. ‘ఈ రోజుతో ఐదుగురి కస్టడీ ముగుస్తుంది. టెర్రర్ లింక్స్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. కేసులో ఎటువంటి బలం లేదు. పోలీసులు ఫారిన్ హ్యాండ్లర్ గురించి కూడా విచారిస్తున్నారు. అరెస్టయిన వాళ్లంతా నిరుపేదలు. వాళ్లు టెర్రరిజం వైపు వెళ్లాలని అనుకోలేదు. రాడికల్ భావజాలానికి మాత్రమే ఆకర్షితులయ్యారు. కేరళలో ఐఎస్ఐఎస్ జెండాలు ఉన్న టీ షర్ట్స్ వేసుకున్న కేసులో నిందితులను నిర్దోషులుగా తేల్చి విడుదల చేశారు. ఈ కేసులో వీళ్లు పోస్టులు మాత్రమే పెట్టారు. ఎటువంటి దేశ వ్యతిరేక చర్యలకు దిగలేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా.