జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థసారథి
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:36 PM
తుగ్లక్ పేరు వినడం తప్ప.. చూడలేదని, జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడారంటూ మండిపడ్డారు.
అమరావతి, ఏప్రిల్ 5: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తుగ్లక్ పేరు వినడం తప్ప.. చూడలేదని, జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారని అన్నారు. ప్రజలు జగన్ తీరు చూసే ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చారని చెప్పారు. 3 రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడారంటూ మండిపడ్డారు. తాను చెప్పింది అందరూ వినాలనే ధోరణిలో జగన్ ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజలకు అపార నమ్మకం ఉందని పేర్కొన్నారు. మంత్రి పార్థసారథి ఆదివారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులను అవమానిస్తారా?. రాబోయే రోజుల్లో వైసీపీకి పుట్టగతులు లేకుండా చేస్తారు’ అని అన్నారు.
ఆ మాట పలకడానికి జగన్ అనర్హుడు
వైసీపీ అధినేత జగన్‌కు విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘తెలుగు జాతి, అమరావతిపై జగన్‌కి ఎందుకంత కక్ష? అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు.. అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. అధికారంలోకి రాగానే 3 రాజధానులు అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం 20 నెలల్లో ఆగిపోయిన రాజధాని పనులన్నింటినీ ప్రారంభించాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల