Share News

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌కు చెమటలు పట్టిస్తున్న లఖ్‌నవూ బౌలర్లు

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:36 PM

ఇవాళ(ఆదివారం)ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడుతోంది. ఐపీఎల్2026లో భాగంగా లఖ్‌నవూ‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌కు చెమటలు పట్టిస్తున్న లఖ్‌నవూ బౌలర్లు
SRH vs LSG IPL 2026

స్పోర్ట్స్ డెస్క్: ఇవాళ(ఆదివారం)ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడుతోంది. ఐపీఎల్2026లో భాగంగా లఖ్‌నవూ‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులను కాటేరమ్మ కొడుకు నిరాశ పరిచారు. టాస్ ఓడిన హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే ఎస్ఆర్‌హెచ్‌కు బిగ్ షాక్ తగిలింది. యువ హిట్టర్ అభిషేక్ శర్మ.. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ చివరి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ రెండో ఓవర్ తొలి బంతికే పెవిలియన్ చేరాడు.


దీంతో 8 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. స్వల్ప పరుగుల వ్యవధిలో ఇషాన్ కిషన్(1), లివింగ్‌స్టోన్(14) సైతం ఔటయ్యారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్లాసెన్(41*), నితీశ్ కుమార్ రెడ్డి(42*) క్రీజ్‌లో ఉన్నారు. ఆల్ రౌండర్ నితీశ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మొత్తంగా లఖ్ నవూ బౌలర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లకు చెమటలు పట్టిస్తోన్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 93/4.


ఇవి కూడా చదవండి:

టాస్ నెగ్గిన లఖ్‌నవూ.. బ్యాటింగ్ ఎవరిదంటే..

సెహ్వాగ్-గంభీర్‌లనే వెనక్కి నెట్టిన వైభవ్!

Updated Date - Apr 05 , 2026 | 04:48 PM