Share News

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన లఖ్‌నవూ.. బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - Apr 05 , 2026 | 03:04 PM

ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన లఖ్‌నవూ.. బ్యాటింగ్ ఎవరిదంటే..
SRH vs LSG

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ కూడా డబుల్ హెడర్ మ్యాచులు జరగనున్నాయి. మరికాసేపట్లో తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ జట్టు రెండు మార్పులు చేసింది. లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అలానే ఎల్ఎస్‌జీ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. నార్ట్‌జే స్థానంలో మణిమారన్ సిద్ధార్థ్‌ను తుది జట్టులోకి తీసుకుంది.


మరోవైపు ఎస్ఆర్‌హెచ్‌కు ఇది మూడో మ్యాచ్ కాగా.. ఎల్ఎస్‌జీకి రెండోది. లఖ్‌నవూ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. రాబోయే మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదుచేయాలని చూస్తోంది. ఎస్ఆర్‌హెచ్ ఆ జట్టు ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్ ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.


తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్:

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయ్‌దేవ్ ఉనద్కత్

ఇంపాక్ట్ సబ్స్: ఎషాన్ మలింగ, సలీల్ అరోరా, డేవిడ్ పైనే, శివమ్ మావి, జీషన్ అన్సారీ

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్:

మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఎడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మనిమారన్ సిద్ధార్థ్, అవేశ్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేశ్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బదోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, ఆన్రిచ్ నోకియా, హిమ్మత్ సింగ్


ఇవి కూడా చదవండి:

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందనిదే..

Updated Date - Apr 05 , 2026 | 03:27 PM