ఐపీఎల్ 2026: చెలరేగిన ప్రసిద్ధ్.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 165
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:28 PM
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూలోని అటల్ బిహారి వాజ్‌పేయ్ క్రికెట్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూలోని అటల్ బిహారి వాజ్‌పేయ్ క్రికెట్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. గుజరాత్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జీటీ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లుతో చెలరేగాడు. జీటీ బౌలర్ల ధాటికి ఎల్ఎస్‌జీ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. అందరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు.
ఓపెనర్ ఐడెన్ మార్క్‌రమ్(30) టాప్ స్కోరర్. గత మ్యాచ్‌లో సంచలనం సృష్టించిన ముకుల్ చౌదరి(18).. ఈ మ్యాచ్‌లో తీవ్రంగా విఫలమయ్యాడు. మిచెల్ మార్ష్(11), రిషబ్ పంత్(18), ఆయుశ్ బదోని(9), నికోలస్ పూరన్(19), అబ్దుల్ సమద్(18), జార్జ్ లిండే(16) పరుగులకు ఔటయ్యారు. షమీ(12*), ఆవేశ్ ఖాన్(4*) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4, అశోక్ శర్మ 2, సిరాజ్ 1, రబాడా 1 వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కేకేఆర్ జట్టులో చేరనున్న రూ.18 కోట్ల స్టార్ ప్లేయర్
డగౌట్‌లో ఫోన్ వాడిన ఆర్ఆర్ టీమ్ మేనేజర్.. స్పందించిన బీసీసీఐ!