ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కేకేఆర్ జట్టులో చేరనున్న రూ.18 కోట్ల స్టార్ ప్లేయర్
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:52 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. తీవ్ర కష్టాల్లో ఉన్న కేకేఆర్‌కు ఊరట కలిగించే వార్త వచ్చింది. శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరణ జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. తీవ్ర కష్టాల్లో ఉన్న కేకేఆర్‌కు ఊరట కలిగించే వార్త వచ్చింది. శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరణ జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. గాయాలబారిన పడి ఇప్పటి వరకు ఐపీఎల్‌కు దూరంగా ఉన్న పతిరణ.. ఏప్రిల్ 17న కేకేఆర్ క్యాంప్‌లో చేరనున్నాడు. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ టెస్టు కూడా క్లియర్ చేశాడు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు పతిరణకు అధికారిక ఎన్ఓసీ జారీ చేసింది. కాగా ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో పతిరణ అందుబాటులోకి రానున్నాడు.
ఐపీఎల్ 2026 వేలంలో పతిరణను కేకేఆర్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సమయంలో అతడు కాలి మడమ గాయం బారిన పడి కీలక మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 6న అతడికి తొలిసారి ఫిట్‌నెస్ టెస్ట్ జరిగింది. గాయం తీవ్రత తగ్గకపోవడంతో పతిరణ ఆ టెస్టుకు హాజరు కాలేకపోయాడు. తాజాగా ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో శ్రీలంక క్రికెట్ ఎన్ఓసీ జారీ చేసింది. వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కేకేఆర్‌కు పతిరణ జట్టులో చేరడం పెద్ద ఊరటినిచ్చే అంశమే!
కేకేఆర్‌కు అసలేమైంది..
మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కేకేఆర్.. ఈ సీజన్‌లో మాత్రం నిరాశపరుస్తూ వస్తోంది. ఈ సీజన్‌లోనే అత్యధిక ధర పెట్టి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కేకేఆర్ కొనుగోలు చేసిన సంగతి తెలసిందే. అతడిపై ఏకంగా రూ.25.20 కోట్లు పెట్టారు. కానీ గ్రీన్ మాత్రం ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. రూ.18కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పతిరణ.. గాయం బారిన పడి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇదిలా ఉంటే.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మొత్తంగా ఒకే ఒక పాయింట్‌తో పాయింట్ల పట్టికలో కేకేఆర్ ఆఖరి స్థానంలో ఉంది. పతిరణ రాకతో జట్టు విజయాల బాట పడుతుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
సెంచరీని మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం చేస్తున్నా: సంజు శాంసన్