కోహ్లీ, రోహిత్ శర్మ సరసన చేరిన సంజు శాంసన్..
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:42 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (శనివారం) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. అద్భుత శతకంతో సంజు పలు రికార్డులు సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (శనివారం) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా115 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీపై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో సంజు పలు రికార్డులు సాధించాడు. అంతేకాకుండా ఓ అరుదైన విషయంలోనూ టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సరసన చేరాడు సంజు శాంసన్.
ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన తర్వాత టీ20ల్లో సంజు సిక్సర్ల సంఖ్య క్వాడ్రపుల్ సెంచరీకి (400) చేరింది. ఈ అరుదైన మైలురాయిని ఇప్పటివరకు సంజుతో కలుపుకుని కేవలం 29 మంది మాత్రమే తాకారు. భారత్ తరఫున సంజుకు ముందు రోహిత్ శర్మ (554), విరాట్ కోహ్లీ (440), సూర్యకుమార్ యాదవ్ (421) వంటి హిట్టింగ్ మిషన్లు ఉన్నారు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (1056) తొలిస్థానంలో ఉన్నాడు. అతనికి చాలా దూరంలో కీరన్ పోలార్డ్ (982), ఆండ్రీ రసెల్ (784) తదితర విండీస్ విధ్వంస ప్లేయర్లు ఉండటం గమనార్హం. 400 సిక్సర్ల మైలురాయి జాబితాలో రోహిత్ శర్మ 9, విరాట్ కోహ్లి 21, సూర్యకుమార్ యాదవ్ 23, సంజు శాంసన్ 29 స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్‌లో తొలి ప్లేయర్‌గా సంజు
ఢిల్లీ మ్యాచ్‌లో చేసిన సెంచరీతో సంజు తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు నాలుగు సెంచరీలు చేశాడు. ఇవన్ని కూడా ఆయా సీజన్‌లో మొట్టమొదటివి కావడం గమన్హారం. 2017, 2019, 2021, 2026 సీజన్లలో తొలి సెంచరీలను సంజూనే చేశాడు. తద్వారానే సీజన్‌లో తొలి సెంచరీలను ఎక్కువ సార్లు చేసిన ఆటగాడిగా శాంసన్ చరిత్ర సృష్టించాడు. అతడి తర్వాత స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ ఉన్నాడు. మెక్‌కల్లమ్ 2008,2015 సీజన్లలో తొలి సెంచరీలు చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
సెంచరీని మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం చేస్తున్నా: సంజు శాంసన్