ఐపీఎల్ 2026: ఆ ఇద్దరు ప్లేయర్లపై బీసీసీఐ చర్యలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 02:44 PM
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం ఇద్దరు ఆటగాళ్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (శనివారం) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఢిల్లీ క్యాపిటల్స్ నితీశ్ రాణాకు జరిమానా విధించింది. సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్ స్లో ఓవర్‌రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ మ్యాచ్ ఫీజ్‌లో రూ. 12 లక్షలు జరిమానా పడింది. సీఎస్కే ఈ సీజన్లో ఇది మొదటి తప్పిదం కావడంతో జరిమానాతో సరిపెట్టారు.
నితీశ్ విషయానికొస్తే.. మ్యాచ్ సందర్భంగా అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గానూ అతడికి జరిమానా పడింది. నితీశ్‌కు మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత, అదనంగా ఓ డీమెరిట్ పాయింట్ శిక్షగా బీసీసీఐ విధించింది. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో 19వ ఓవర్లలో ట్రిస్టన్ స్టబ్స్ గ్లవ్స్ మార్చుకోవాలని అంపైర్లను కోరగా, వారు నిరాకరించారు. దీంతో మధ్యలో రానా కల్పించుకొని స్టబ్స్‌కు మద్దతుగా థర్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అసభ్య పదజాలం కూడా వాడాడని సమాచారం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఆర్టికల్ 2.3 నిబంధన ప్రకారం నితీశ్ ప్రవర్తన లెవెల్ 1 నేరం కిందకు వస్తుంది. ఇందుకు మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను బీసీసీఐ కేటాయించింది.
ఇవి కూడా చదవండి:
ధోనికి సాధ్యంకాని రికార్డును అందుకున్న సంజు శాంసన్
సంజు కాదు.. విజయానికి కారణం వాళ్లే: రుతురాజ్