ధోనికి సాధ్యంకాని రికార్డును అందుకున్న సంజు శాంసన్
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:51 PM
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. సీఎస్కే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సంజు విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సీఎస్కే స్టార్ ఎంఎస్ ధోనికి సాధ్యం కానీ రికార్డును సంజు శాంసన్(Sanju Samson) తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ బాదిన మొట్టమొదటి వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 2008 నుంచి సీఎస్కేకి పూర్తిస్థాయి కీపర్‌గా ఎంఎస్ ధోని ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సీజన్లు ఆడిన ధోనికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు ధోని అత్యధిక స్కోరు 84 పరుగులుగా ఉంది. అయితే ధోని(MS Dhoni) దాదాపుగా లోయర్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు రావడంతో ఒక్కసారి మూడంకెల స్కోర్‌ను అందుకోలేకపోయాడు. కానీ సంజు మాత్రం ఓపెనర్‌గా దిగడంతో సీఎస్కే తరపున తొలి ఎడిషన్‌లో శతకం బాది చరిత్ర సృష్టించాడు.
ఇప్పటి వరకు శాంసన్ ఐపీఎల్లో నాలుగు శతకాలు సాధించాడు. అతను ఐపీఎల్ 2017లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున తన తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు శతకాలు బాదాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు, శాంసన్ ట్రేడ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్‌ను విడిచి చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో చేరాడు. సీజన్ ప్రారంభంలో బ్యాటింగ్ ఆడటంలో ఇబ్బంది పడిన శాంసన్... తొలి మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకుని సెంచరీతో చెలరేగడమే కాకుండా.. అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
సంజు కాదు.. విజయానికి కారణం వాళ్లే: రుతురాజ్
అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్