వ్యవస్థను కదిలించిన కానిస్టేబుల్ రేవతి సాహసం.. న్యాయ వ్యవస్థలో మార్పునకు ఇదే సమయం!
ABN , Publish Date - Apr 12 , 2026 | 09:56 AM
'రేవతి'. ఈమె ఒక సామాన్య కానిస్టేబుల్. కానీ వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా, దేనికీ భయపడకుండా నిలిచి చరిత్ర సృష్టించారు. 'జస్టిస్ వర్మ'. ఈయన వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఢిల్లీ కరెన్సీ నోట్ల కట్ల కేసులో తన బాధ్యతను గుర్తించడానికి లేదా రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి ఆపసోపాలుపడ్డారు.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 12: ఢిల్లీ కరెన్సీ కేసు వంటి కీలక విషయాల్లో నిర్ణయాలు ఆలస్యమవ్వడం వల్ల ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది. రేవతి సాక్ష్యం చెప్పిన సాత్తాంకుళం కేసులో కూడా తీర్పు రావడానికి ఆరేళ్లు పట్టింది. అందుకే న్యాయం జరగడానికి సమయం పట్టవచ్చు, కానీ దానికి ఒక డెడ్లైన్ ఉండాలి. 'ఒకవైపు రేవతి వంటి వారు తక్షణమే స్పందించి వ్యవస్థను కాపాడుతుంటే, మరోవైపు జస్టిస్ వర్మ వంటి వారు తమ తప్పును తెలుసుకోవడానికే ఇంత సమయం తీసుకోవడం న్యాయవ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతోంది. అందుకే టెక్నాలజీ సాయంతో ఈ జాప్యాన్ని అరికట్టడం ఎంతో ముఖ్యం. ఈ అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన ట్వీట్ ఆలోచింపచేస్తోంది.
మరిన్ని వార్తలు చదవండి: