క్రీడా మైదానాలు 'కార్యక్రమాల' వేదికలు కాకూడదు..
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:31 AM
తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం. అయితే, ఆ ప్రోత్సాహం కేవలం నిధుల రూపంలోనే కాకుండా.. క్రీడాకారులు ఆడే మైదానాలను కూడా గౌరవించేలా ఉండాలి.
ఆంధ్రజ్యోతి, మార్చి 30: క్రీడలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం ఉంది. అయితే, ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికల్లో రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు క్రీడాకారులను, క్రీడాభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, నిర్వాహకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మైదానం.. క్రీడాకారులకు దేవాలయం..
ఒక అథ్లెట్ లేదా విద్యార్థి గెలుపు కోసం.. క్రీడాకారులు ఏళ్ల తరబడి ఆ మైదానంలోనే చెమటోడుస్తారు. ఆ 'ప్లేయింగ్ ఏరియా' లేదా 'ప్రాక్టీస్ టర్ఫ్' వారికి అత్యంత పవిత్రమైనది. అయితే ఆ మైదానాల్లో స్టేజీలు వేయడం, భారీ వాహనాలు తిప్పడం వల్ల ఆ ట్రాక్స్ లేదా టర్ఫ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది క్రీడాకారుల శిక్షణ, భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తుంది. ఇదే అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్... డీఎంకే మేనిఫెస్టో
వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ