Share News

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

ABN , Publish Date - Apr 06 , 2026 | 10:27 AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న 'అమరావతి' రాజధాని అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు భయాందోళనలతో కాకుండా.. వివేకంతో ఆలోచించాలని ఆయన సూచించారు..

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..
Amaravati capital issue

ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 6: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో అధికార బిల్లుకు సహకరించిన అన్ని పార్టీలకూ.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్ష వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న వింత వాదనలు, అమరావతి వ్యతిరేక ప్రకటనలు రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు భయాందోళనలతో కాకుండా.. వివేకంతో ఆలోచించాలని, తదనుగుణంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.


ఇవి కూడా చదవండి..

క్రీడా మైదానాలు 'కార్యక్రమాల' వేదికలు కాకూడదు..

Updated Date - Apr 06 , 2026 | 11:22 AM