అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
ABN , Publish Date - Apr 12 , 2026 | 10:44 AM
శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కోచ్ హేమాంగ్ బదానీ, బ్యాటర్లు నితీశ్ రానా, కరుణ్ నాయర్ అంపైర్‌తో వాగ్వాదం చేయడం కెమెరాల కంటపడింది. అసలేం జరిగిందంటే..
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో తొలి విజయాన్ని సీఎస్కే తన ఖాతాలో వేసుకుంది. మెరుపు సెంచరీతో సంజు శాంసన్.. సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో ఊగిపోతూ హెల్మెట్‌ను నేలకేసి కొట్టడం, గ్లోవ్స్‌ను విసిరేయడం కెమెరాలకు చిక్కింది. మరి.. స్టబ్స్ అంతలా కోపంతో ఊగిపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
213 పరుగుల భారీ టార్గెట్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ 189 పరుగులకే ఆలౌటైంది. అంతకంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో స్టబ్స్ తన గ్లోవ్స్‌ను మార్చుకునే ప్రయత్నం చేశాడు. గ్లోవ్స్ చెమట పట్టడంతో స్టబ్స్ పదే పదే బ్యాట్ పట్టును కోల్పోయాడు. దీంతో గ్లోవ్స్‌ను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అంపైర్‌ను కోరాడు. అందుకు అంపైర్ ససేమీరా అనడంతో చేసేదేం లేక స్టబ్స్ అదే గ్లోవ్స్‌తో బ్యాటింగ్ కొనసాగించాడు.
19వ ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడే యత్నంలో మిడాఫ్‌లో నూర్ అహ్మద్ చేతికి స్టబ్స్ చిక్కాడు. దీంతో నిరాశతో వెనుతిరిగిన స్టబ్స్.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో ఊగిపోతూ బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేయడంతో పాటు గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్టబ్స్ ప్రవర్తనను ఢిల్లీ ఆటగాడు నితీశ్ రానా సమర్థించాడు. అంతేకాక థర్డ్ అంపైర్‌తో రానా వాదనకు దిగాడు. చెమటతో ఉన్న గ్లోవ్స్‌తో ఆడడం వల్ల బ్యాటింగ్‌కు ఆటంకం కలుగుతుందని, స్టబ్స్‌కు గ్లోవ్స్ మార్చుకునేందుకు అవకాశమెందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమంగ్ బదాని కూడా అంపైర్‌తో ఇదే విషయమై వాదనకు దిగడం కెమెరాలో కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
చెన్నై గెలిచె.. సంజూ అజేయ శతకం