Share News

అంబేడ్కర్ జయంతి.. ఈ రోజు ఏయే కార్యాలయాలకు సెలవో తెలుసా..

ABN , Publish Date - Apr 12 , 2026 | 09:18 AM

ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంక్ హాలిడేగా నిర్ణయించింది. అలాగే ఈ రోజు ఏయే కార్యాలయాలకు సెలవు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అంబేడ్కర్ జయంతి.. ఈ రోజు ఏయే కార్యాలయాలకు సెలవో తెలుసా..
Ambedkar Jayanti 2026

ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంక్ హాలిడేగా నిర్ణయించింది. అయితే, ఈరోజు ఏం తెరిచి ఉంటాయో, మూసివేస్తారో ఈ కథనంలో చూద్దాం..


ఏయే కార్యాలయాలు సెలవంటే..

అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. అయితే, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉండనున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కోర్టులు, తపాలా కార్యాలయాలను మూసివేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తారు.


అత్యవసర సేవలు..

ఆస్పత్రులు, మెడికల్ షాపులు వంటి అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయి. కొన్ని ప్రదేశాల్లో ఔట్ పేషెంట్ సేవలు పరిమితం కావచ్చు. అలాగే బస్సులు, రైళ్లు, క్యాబ్ సర్వీసులతో సహా ప్రజా రవాణా, పెట్రోల్ బంకులు యథావిధిగా నడుస్తాయి.


అదే రోజు మరికొన్ని పండుగలు..

ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతితోపాటు దేశవ్యాప్తంగా మరికొన్ని పండుగలు ఉన్నాయి. తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ, బోహాగ్ బిహు, మహా విశ్వ సంక్రాంతి, బిజు/బుయిసు పండుగ, చెయిరౌబా వంటి అనేక ప్రాంతీయ వేడుకలు ఉన్నాయి. ఈ పండుగలను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బెంగాల్‌లో ‘పౌరస్మృతి’ అమలు చేస్తాం

తమిళనాట.. హోరా హోరీగా ఎన్నికల ప్రచారం

Updated Date - Apr 12 , 2026 | 09:52 AM