ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు రజతం
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:14 PM
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ స్వర్ణం గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. ఈ టోర్నీలో తన అద్భుత ప్రయాణాన్ని రజతంతో ముగించాడు. పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగుపెట్టి సంచలన విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆయుష్.. టైటిల్ పోరులో తడబడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ స్వర్ణం గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. ఈ టోర్నీలో తన అద్భుత ప్రయాణాన్ని రజతంతో ముగించాడు. పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగుపెట్టి సంచలన విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆయుష్.. టైటిల్ పోరులో తడబడ్డాడు. రెండో సీడ్ షియుకి(చైనాతో)తో జరిగిన ఫైనల్‌లో ఆయుష్ ఓటమిని చవిచూశాడు. 42 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఆయుష్ 8-21, 10-21 తేడాతో వరుస గేముల్లో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు.
ప్రస్తుతం ప్రపంచ నంబర్ 2గా ఉన్న షియుకి ఈ మ్యాచ్‌లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా అద్బుతమైన విజయం అందుకుని ఆసియా ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. 20 ఏళ్ల ఆయుష్ శెట్టి ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శనే కనబర్చాడు. ఫైనల్ చేరే క్రమంలో ప్రపంచ నంబర్ వన్ షట్లర్ కున్లావత్ వితిద్సన్‌తో పాటు, వరల్డ్ నంబర్ 4, వరల్డ్ నంబర్ 7లను కూడా ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చాడు. ఫైనల్ పోరులో మాత్రం చైనా షట్లర్ ధాటికి నిలవలేక రజతంతో సరిపెట్టుకున్నాడు.
61 ఏళ్ల నిరీక్షణ..
ఈ టోర్నీలో 61 ఏళ్ల క్రితం భారత్‌కు స్వర్ణం వచ్చింది. ఈసారైనా ఆయుష్ అద్భుత ప్రదర్శనతో దేశానికి గోల్డ్ వస్తుందనే భావించారంతా. కానీ అనూహ్య ఓటమితో పురుషుల సింగిల్స్‌లో ఈ నిరీక్షణ ఇంకా కొనసాగనుంది. ఇప్పటివరకు ఈ టైటిల్ గెలిచిన ఏకైక భారత ఆటగాడు దినేశ్ ఖన్నా(1965) కావడం విశేషం.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
సెంచరీని మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం చేస్తున్నా: సంజు శాంసన్