Share News

ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:19 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్
Ashwin comments

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టు కేవలం రోహిత్ శర్మపైనే ఆధారపడిందని అనుకోవడం చాలా పొరపాటని తెలిపాడు.


అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ...ముంబై(Mumbai Indians) బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్ఠంగా ఉందని, ఆ జట్టుకు రోహిత్ ఒక్కడే దిక్కు కాదని వెల్లడించాడు. అశ్విన్ ముంబై జట్టు బ్యాటింగ్ గురించి మాట్లాడుతూనే ఆ జట్టు ఎదుర్కొంటున్న అసలు సవాళ్లను ప్రస్తావించాడు. ఈ సీజన్లో ముంబై జట్టును బౌలింగ్ విభాగం దెబ్బతీస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా స్పిన్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించడం లేదని, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మిగిలిన బౌలర్ల నుంచి తగిన సహకారం లభించడం లేదని పేర్కొన్నాడు.


ఓపెనింగ్ బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు ఇస్తుండటం హార్దిక్ సేనకు తలనొప్పిగా మారిందని అశ్విన్ విశ్లేషించాడు. అలానే ముంబై, బెంగళూరు జట్ల మధ్య పోటీ అంటేనే అది రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీగా మారుతుందని, వాంఖడే స్టేడియంలో మరో భారీ స్కోర్ల మ్యాచ్ ఖాయమని అతడు జోస్యం చెప్పాడు. మొత్తంగా అశ్విన్ చేసిన ఈ కామెంట్స్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల అభిమానుల్లో కాక రేపుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కేకేఆర్‌ జట్టులో చేరనున్న రూ.18 కోట్ల స్టార్ ప్లేయర్

డగౌట్‌లో ఫోన్ వాడిన ఆర్ఆర్ టీమ్ మేనేజర్.. స్పందించిన బీసీసీఐ!

Updated Date - Apr 12 , 2026 | 05:38 PM