Share News

ఐపీఎల్ 2026: గిల్, బట్లర్ హాఫ్ సెంచరీలు.. లఖ్‌నవూపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం

ABN , Publish Date - Apr 12 , 2026 | 07:22 PM

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో జీటీ ఘన విజయం సాధించింది. ఎల్ఎస్‌జీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

ఐపీఎల్ 2026: గిల్, బట్లర్ హాఫ్ సెంచరీలు.. లఖ్‌నవూపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
GT vs LSG

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో జీటీ ఘన విజయం సాధించింది. ఎల్ఎస్‌జీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. జీటీ బ్యాటర్లను కట్టడి చేయడంలో లఖ్‌నవూ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.


సాయి సుదర్శన్(15) మరోసారి నిరాశపర్చాడు. గిల్(56), బట్లర్(60) చెలరేగి ఆడారు. వాషింగ్టన్ సుందర్(21*), రాహుల్ తెవాటియా(10*) నాటౌట్‌గా నిలిచారు. లఖ్‌నవూ బౌలర్లలో షమి, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ తలొక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఎల్‌ఎస్‌జీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్క్‌రమ్(30) టాప్ స్కోరర్. కాగా గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో చెలరేగాడు. అశోక్ శర్మ 2, సిరాజ్ 1, రబాడా 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు రజతం

Updated Date - Apr 12 , 2026 | 07:23 PM