Share News

వైభవ్ ముందు అభిషేక్ శర్మ చిన్నపిల్లాడు: పాక్ మాజీ పేసర్

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:45 PM

రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడి బ్యాటింగ్ తీరుపై ఇప్పటికే అనేక మంది ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ చేసిన ఓ ప్రకటన నెట్టింట రచ్చ చేస్తోంది.

వైభవ్ ముందు అభిషేక్ శర్మ చిన్నపిల్లాడు: పాక్ మాజీ పేసర్
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడి బ్యాటింగ్ తీరుపై ఇప్పటికే అనేక మంది ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ మాత్రం ఓ విచిత్ర ప్రకటన చేశాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


వైభవ్ టీమిండియాలోకి వస్తే.. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను అభిమానులు మర్చిపోతారని తన్వీర్ జోస్యం చెప్పాడు. వైభవ్ దూకుడు చూస్తుంటే క్రికెట్‌లో అతను అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని అతడు అభిప్రాయపడ్డాడు. ఒకవేళ టీమిండియాలో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ కలిసి బ్యాటింగ్ చేస్తే.. అందరి దృష్టి వైభవ్‌పైనే ఉంటుందని తెలిపాడు. అభిషేక్ శర్మ కనీసం వైభవ్ దరిదాపుల్లోకి కూడా రాలేడని, ప్రేక్షకులు కేవలం వైభవ్ ఆటనే గమనిస్తారంటూ సంచలన కామెంట్స్ చేశాడు. అయితే సుదీర్ఘ కాలం పాటు వైభవ్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, కానీ ప్రస్తుతం అతని ఆట తీరు మాత్రం అద్భుతమని తన్వీర్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు రజతం

Updated Date - Apr 12 , 2026 | 05:55 PM