ఇషాన్ కిషన్ చేసిన మిస్టేక్.. గర్ల్‌ఫ్రెండ్ అదితి షాకింగ్ లుక్!
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:10 PM
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చేసిన పనికి గ్యాలరీలో ఉన్న అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఓ కీలకమైన రనౌట్ అవకాశాన్ని చేజార్చాడు. దీంతో గ్యాలరీలో ఉన్న అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా ముఖం నిరుత్సాహంగా పెట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. ఇక పూర్తి కథనంలోకి వెళ్తే...
నిరాశలో అదితి!
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో లఖ్‌నవూ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 5 వికెట్లు కోల్పోయిన ఎల్ఎస్‌జీ 19.5 ఓవర్లో లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ రిషబ్ పంత్ చివరి వరకు నిలబడి.. ఎస్ఎస్‌జీ విజయంలో కీలక పాత్రపోషించాడు. లఖ్‌నవూ ఇన్నింగ్స్16వ ఓవర్లో జయదేవ్ ఉనద్కత్ వేసిన బంతికి పంత్‌ను రనౌట్ చేసే మంచి అవకాశం ఇషాన్ కిషన్‌కు లభించింది.
ఆ సమయంలో మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరిత దశలో ఉంది. పంత్ వికెట్ పడి ఉంటే మ్యాచ్ ఫలితం హైదరాబాద్ వైపు మొగ్గేది. కానీ ఇషాన్ కిషన్ రనౌట్ మిస్ చేయడంతో స్టేడియంలో ఉన్న అదితి హుండియా తీవ్ర నిరుత్సాహానికి గురైంది. ఆమె ముఖం మాడిపోవడమే కాకుండా చాలా దిగులుగా కనిపించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. తన బాయ్ ఫ్రెండ్ జట్టు ఓడిపోవడం, అందులోనూ ఇషాన్ కిషన్ చేసిన పొరపాటు పట్ల అదితి రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుంది.
ఇవి కూడా చదవండి:
నన్ను వాళ్లు మాత్రం గుర్తించక పోవచ్చు: షమీ
స్టేడియంలో యువతి చేసిన రచ్చ.. ఫిదా అయిన ఆర్సీబీ ఫ్యాన్స్!