Share News

స్టేడియంలో యువతి చేసిన రచ్చ.. ఫిదా అయిన ఆర్సీబీ ఫ్యాన్స్!

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:35 AM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు కేవలం మైదానంలోనే కాదు.. గ్యాలరీలో కూడా హోరాహోరీగా సాగింది. ఓ ఆర్సీబీ మహిళా అభిమాని.. సీఎస్కే ఫ్యాన్‌ను ఆటపట్టించింది.

స్టేడియంలో యువతి చేసిన రచ్చ.. ఫిదా అయిన ఆర్సీబీ ఫ్యాన్స్!
RCB fan celebrates victory

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2025లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరు కేవలం మైదానంలోనే కాదు.. గ్యాలరీలో కూడా హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో 43 పరుగు తేడాతో ఆర్సీబీ అద్భుత విజయం సాధించడంతో బెంగళూరు అభిమానులు సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో ఓ ఆర్సీబీ మహిళా అభిమాని చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ యువతి చేసిన పనికి తోటి ఆర్సీబీ అభిమానులు(RCB Fans) ఫిదా అవుతున్నారు.


ఆ వీడియోలో సదరు యువతి ఆర్సీబీ జట్టు గెలిచిన ఆనందంలో పక్కనే ఉన్న సీఎస్కే అభిమాని వైపు తిరిగి బిగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. ఆ అమ్మాయి అరుస్తున్న సమయంలో పక్కనే ఉన్న చెన్నై అభిమాని(CSK Fan) మాత్రం చాలా నిశ్శబ్ధంగా, కాస్త నిరాశగా కనిపించాడు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది అన్నట్లు ఆ యువతి చేసిన సందడికి సీఎస్కే అభిమాని మౌనంగా ఉన్నాడు. అయితే వీరిద్దరు వేరు వేరు జట్లకు అభిమానులు అయినప్పటికీ స్నేహితులని సమాచారం. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ అభిమానుల ఎమోషన్ అంటే ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే.. గెలుపోటములు సహజం, కానీ ఆ అమ్మాయి ఎనర్జీ మాత్రం వేరే లెవల్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నైపై ఆర్సీబీ చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమన్హారం. ఇక భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 207 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించగా.. చెన్నై వరుసగా మూడు ఓటములు చవి చూసింది.


ఇవి కూడా చదవండి:

'పక్కకు తప్పుకో'.. సంజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎస్కే ఫ్యాన్స్

ఐపీఎల్ 2026: భువనేశ్వర్‌ అరుదైన రికార్డు..

Updated Date - Apr 06 , 2026 | 11:41 AM