Share News

IPL 2026: చెన్నై ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్

ABN , Publish Date - Apr 06 , 2026 | 08:28 AM

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా మూడో ఓటమి. అయితే, హ్యాట్రిక్ ఓటమికి తానే బాధ్యుడినని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు.

IPL 2026: చెన్నై ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సీఎస్కేపై 43 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో చెన్నై వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఈ సారికూడా టాప్ ఆర్డర్‌ విఫలమైంది. ఇక్కడ సీఎస్కేకి సానుకూలాంశం ఏమిటంటే.. టాప్ ఆర్డర్ విఫలమైనా మిగతా బ్యాటర్లు పోరాడు. అయితే, హ్యాట్రిక్ ఓటమికి తానే బాధ్యుడినని కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు.


మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మీడియాతో మాట్లాడుతూ.. ' నేను ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది కావచ్చు. అందుకే, ఈ ఓటమికి నాదే బాధ్యత. బౌలింగ్ సమయంలో 14వ ఓవర్‌ వరకూ మ్యాచ్‌ మా ఆధీనంలోనే ఉంది. ఆ తర్వాత మ్యాచ్‌ స్వరూపం మారి... మా నుంచి జారిపోవడం ప్రారంభమైంది. టిమ్‌ డేవిడ్‌ను మా అన్షుల్ కాంబోజ్‌ క్లీన్‌బౌల్డ్ చేసినా.. అది నోబాల్‌ కావడం మాకు పెద్ద మైనస్ అయ్యింది. అక్కడి నుంచి డేవిడ్‌ దూకుడుగా ఆడాడు. అతడు ఔటై ఉంటే ఆర్సీబీ ఇంత భారీ స్కోరు చేసేదే కాదేమో. లక్ష్య ఛేదనలో మాకు ఆరంభం దక్కలేదు. సర్ఫరాజ్‌ ఖాన్, ప్రశాంత్ వీర్, ఓవర్టన్ చక్కగా బ్యాటింగ్ చేశారు. దురదృష్టవశాత్తు శివం దూబే పెవిలియన్‌కు చేరాడు ’ అని రుతురాజ్‌ వెల్లడించాడు. ఆర్సీబీ మ్యాచ్ లో రుతురాజ్‌ గైక్వాడ్ 3 బంతుల్లో ఏడు పరుగులు చేశాడు. అందులో ఒక సిక్స్‌ కూడా ఉంది.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నైపై ఆర్సీబీ చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమన్హారం. ఇక భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 207 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

చిన్నస్వామి స్టేడియంలో అనిల్ కుంబ్లే, ద్రవిడ్‌లకు అరుదైన గౌరవం

చెన్నై.. మూడో‘సారీ’

Updated Date - Apr 06 , 2026 | 08:33 AM