Share News

ఐపీఎల్ 2026: భువనేశ్వర్‌ అరుదైన రికార్డు..

ABN , Publish Date - Apr 06 , 2026 | 09:43 AM

ఐపీఎల్ 2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు భువ‌నేశ్వర్ కుమార్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే వికెట్ తీసి.. ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

ఐపీఎల్ 2026: భువనేశ్వర్‌ అరుదైన రికార్డు..
Bhuvneshwar Kumar 200 wickets

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 250 పరుగుల చేయగా... సీఎస్కే 207 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆట‌గాడు భువ‌నేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. చెన్నైతో మ్యాచ్ లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.


ఈ ఘ‌న‌త సాధించిన తొలి సీమర్‌గానూ భువ‌నేశ్వర్ చ‌రిత్ర పుట‌ల్లో నిలిచాడు. సీఎస్కే ప్లేయర్ ఆయుశ్ మాత్రే వికెట్ తీసిన భువీ 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే టీమిండియా త‌ర‌ఫున ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన‌ రెండో బౌల‌ర్‌గా, ఫాస్ట్ బౌల‌ర్ల జాబితాలో భువనేశ్వర్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా స్పీడ‌స్టర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం ల‌సిత్ మ‌లింగ‌లు కూడా భువ‌నేశ్వర్ కంటే వెనుక‌బ‌డి ఉన్నారు.


ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్న తొలి ప్లేయర్ గా స్పిన్నర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ నిలిచాడు. అతడు ఇప్పటివ‌ర‌కు 176 మ్యాచ్‌ల్లో 224 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజాగా భువ‌నేశ్వర్ 192 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. కేకేఆర్ స్పిన్నర్ సునీల్ న‌రైన్(191 మ్యాచ్‌ల్లో 193 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 4 ఓవ‌ర్లు వేసి 41 ప‌రుగులిచ్చి 3 కీల‌క వికెట్లు తీశాడు.


విరాట్ మ‌రో రికార్డు..

ఇప్పటికే అనేక రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్న విరాట్ కోహ్లీ తాజాగా సీఎస్‌కేతో టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్దలుకొట్టాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 28 ప‌రుగులు చేయ‌డం ద్వారా కోహ్లీ ఆ జ‌ట్టుపై 1174 ప‌రుగులు సాధించాడు. త‌ద్వారా ఒకే జ‌ట్టుపై అత్యధిక ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గా కోహ్లీ నిలిచాడు. గతంలో రోహిత్ శ‌ర్మ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై 1161 ప‌రుగులు సాధించాడు.


ఇవి కూడా చదవండి:

చెన్నై ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్

చిన్నస్వామి స్టేడియంలో అనిల్ కుంబ్లే, ద్రవిడ్‌లకు అరుదైన గౌరవం

Updated Date - Apr 06 , 2026 | 09:45 AM