Home » LSG
ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎల్ఎస్‌జీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. లఖ్‌నవూపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన జోష్ హేజిల్‌వుడ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు వరించింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం బయటపడింది.
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. సొంతగడ్డపై ఆర్సీబీ బౌలర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది.
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎల్ఎస్‌జీ బ్యాటింగ్‌కు దిగనుంది.
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో జీటీ ఘన విజయం సాధించింది. ఎల్ఎస్‌జీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూలోని అటల్ బిహారి వాజ్‌పేయ్ క్రికెట్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వానిందు హసరంగ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో హసరంగ స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జార్జ్ లిండేని ఎల్ఎస్‌జీ ఎంపిక చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు సంచలన విజయాన్ని అందించాడు 22 ఏళ్ల ముకుల్ చౌదరి. తాజాగా ముకుల్ తండ్రి దిలీప్ చౌదరి తన కొడుకు ఆడిన తీరుపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
కేకేఆర్ ఓపెనర్ ఫిల్ అలెన్ ఔటైన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ క్యాచ్ తీసుకునేటప్పుడు దిగ్వేశ్ బౌండరీ లైన్‌ను తాకినట్లు కేకేఆర్ అభిమానులు ఆరోపించారు. ఫీల్డ్ అంపైరే నిర్ణయం తీసుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. వీటిపై కేకేఆర్ ప్లేయర్ రోవ్‌మన్ పావెల్ మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చేసిన పనికి గ్యాలరీలో ఉన్న అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా ముఖం ఒక్కసారిగా మారిపోయింది.