కోహ్లీ ఇచ్చిన సలహాను అతడిపైనే ప్రయోగించా: ప్రిన్స్ యాదవ్
ABN , Publish Date - May 08 , 2026 | 02:31 PM
ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ఆర్సీబీ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీని ఔట్ చేయడంపై ఎల్ఎస్‌జీ బౌలర్ ప్రిన్స్ యాదవ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో ఓటమిని నమోదు చేసింది. గురువారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఎల్ఎస్‌జీతో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 140.4కి.మీ వేగంతో వచ్చిన ఔట్ స్వింగర్‌ను విరాట్ సరిగ్గా అంచనా వేయలేక ఔటై పెవిలియన్ చేరాడు. ఛేజ్ మాస్టర్ విరాట్.. ఐపీఎల్‌లో లక్ష్యఛేదనలో తొమ్మిదేళ్ల తర్వాత డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి. మ్యాచ్ అనంతరం కోహ్లీని ఔట్ చేయడంపై ఎల్ఎస్‌జీ బౌలర్ ప్రిన్స్ యాదవ్ స్పందించాడు.
‘ఈ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్ అనంతరం విరాట్ భయ్యాతో నేను మాట్లాడాను. బంతి ఒక నిర్దిష్ట లెంగ్త్‌లో స్వింగ్ అవుతున్నంతసేపు అదే లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని సలహా ఇచ్చాడు. ఇప్పుడు తెలివిగా ఆ చిట్కాను పాటించి అతడిని ఔట్ చేశాను’ అని ప్రిన్స్ యాదవ్ వెల్లడించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ప్రిన్స్ 3 వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రిన్స్ యాదవ్‌ను కోహ్లీ అభినందించాడు. ఇదిలా ఉంటే, ప్రిన్స్ యాదవ్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్
హనీ ట్రాప్ ఉచ్చులో పడకండి.. బీసీసీఐ కీలక ఆదేశాలు