ఐపీఎల్ 2026: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ
ABN , Publish Date - Apr 15 , 2026 | 07:17 PM
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎల్ఎస్‌జీ బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎల్ఎస్‌జీ బ్యాటింగ్‌కు దిగనుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా నాలుగింట్లో రెండు మ్యాచులు గెలిచిన లఖ్‌నవూ.. ఏడో స్థానంలో ఉంది. ఇరు జట్లకు ఈ పోరు కీలకమే. ఒకవేళ ఈ మ్యాచులో ఆర్సీబీ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఆర్సీబీ తుది జట్టు:
ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ దార్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, కనిష్క్ చౌహాన్, మంగేశ్ యాదవ్
ఎల్ఎస్‌జీ తుది జట్టు:
ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షమి, ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ సింగ్ రాఠి, ప్రిన్స్ యాదవ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: మనిమారన్ సిద్ధార్ధ్, జార్జ్ లిండే, మ్యాథ్యూ బ్రిట్జ్కే, హిమ్మత్ సింగ్, మయాంక్ యాదవ్
ఇవి కూడా చదవండి:
అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్
ఆ విషయం నాకు సంతృప్తినిచ్చింది: అజింక్య రహానే