Share News

గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కేకు కొత్త టెన్షన్..!

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:55 PM

ఐపీఎల్‌ 2026లో హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి, సంతోషంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. నిన్న కేకేఆర్‌ మ్యాచ్‌లో గాయపడిన పేస్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ తదుపరి మ్యాచ్‌లో ఆడకపోవచ్చని సమాచారం.

గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కేకు కొత్త టెన్షన్..!
CSK injury news

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా హ్యాట్రిక్ ఓటముల తర్వాత రెండు వరుస విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ జోష్‌లో ఉంది. తదుపరి మ్యాచుల్లో కూడా ఇలానే గెలిచి.. తమ జైత్రయాత్రను కొనసాగించాలని సీఎస్కే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రుతురాజ్ సేనాకు ఓ కొత్త తలనొప్పి వచ్చి పడింది. గాయపడిన వారి జాబితాలో ఎంఎస్ ధోనీ సరసన ఓ బౌలర్ చేరినట్లు సమాచారం. అసలు స్టోరీ ఏమిటంటే..


మంగళవారం(ఏప్రిల్ 15) కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో పేస్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ గాయపడిన సంగతి తెలిసిందే. అతడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆడేది అనుమానమని తెలుస్తుంది. ఖలీల్‌ తొడ కండరాల గాయం నుంచి ఇంకా తేరుకోలేదని సమాచారం. నిన్నటి మ్యాచ్‌లో తన స్పెల్‌ను పూర్తి చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. తన స్పెల్‌ చివరి బంతి వేసేందుకు ఎంత ‍ప్రయత్నించినా సాధ్య పడక.. చివరకు మైదానాన్ని వీడాడు. దీంతో మిగిలిన ఆ బంతిని గుర్జప్‌నీత్‌తో వేయించాడు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.


ఖలీల్‌ గాయానికి స్కాన్‌ చేసిన వైద్యులు.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించినట్లు సమాచారం​. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 18న ఆడనుంది. ఆ సమయానికి ఖలీల్‌ కోలుకోవడం కష్టమేనని క్రీడా వర్గాలు తెలిపాయి. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్‌ విజయాలను సాధించాలని సీఎస్కే పట్టుదలగా ఉంది. ఈక్రమంలో ఖలీల్‌ అందుబాటులో లేకపోతే, ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బేనని క్రీడా నిపుణులు చెబుతున్నారు.


ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు నుంచే చెన్నై జట్టును గాయాల సమస్య వేధిస్తోంది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సైడ్‌ స్ట్రెయిన్‌ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో సీఎస్కేను ఖలీల్‌ గాయం కలవరపెడుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా అతనిపై ఒత్తిడి తేకూడదని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి:

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

ఆ విషయం నాకు సంతృప్తినిచ్చింది: అజింక్య రహానే

Updated Date - Apr 15 , 2026 | 06:01 PM