Share News

పీసీబీ పరువు తీసిన పాకిస్థాన్ క్రికెటర్..వీడియో వైరల్

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:14 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను ఉద్దేశించి ఆ దేశ వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెజాద్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను పోలుస్తున్న వారికి చురకలు అంటించాడు.

పీసీబీ పరువు తీసిన పాకిస్థాన్ క్రికెటర్..వీడియో వైరల్
Ahmed Shehzad comments

స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం ప్రేక్షకులు లేకుండానే పాకిస్థాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. ఏదో భారత్‌కు పోటీగా నిర్వహించాలనే తాపత్రయమే తప్ప.. ఆ లీగ్.. గల్లీ మ్యాచుల కంటే దారుణంగా ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పీఎల్ఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం కూడా రేగింది. ఇలా ఏదో ఒక విధంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నవ్వుల పాలవుతుంటే... తాజాగా దేశ వెటరన్ క్రికెటర్..బోర్డు పరువే తీసేశాడు.


పీఎస్‌ఎల్‌ను ఉద్దేశించి ఆ దేశ సీనియర్ క్రికెటర్‌ అహ్మద్‌ షెజాద్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఐపీఎల్‌లో అమ్ముడుపోని వాళ్లు మాత్రమే పీఎస్‌ఎల్‌ వైపు చూస్తున్నారంటూ పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) పరువు తీశాడు. అంతేకాక ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను పోలుస్తున్న వారికి తన మాటలతో చురకలు అంటించాడు.


తన యూట్యూబ్‌ ఛానెల్‌లో షెజాద్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్‌ నుంచి రిటైర్‌ అయిన వాళ్లు, లేదంటే ఐపీఎల్‌లో కెరీర్‌ ముగిసిపోయిందని భావించిన ఆటగాళ్లు, అక్కడి వేలంలో అమ్ముడుపోని వాళ్లు మాత్రమే పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు వస్తున్నారు. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ ఐపీఎల్‌లో కెరీర్‌ ముగిసిన తర్వాతే ఇక్కడికి వచ్చారు. చిన్న అవకాశం దొరికినా చాలా మంది ఐపీఎల్‌లోనే కొనసాగుతారు. పీఎస్‌ఎల్‌ వేలంలో అమ్ముడుపోయినప్పటికీ ఐపీఎల్‌ నుంచి ఆఫర్‌ వస్తే మాత్రం అక్కడికే వెళ్తారు. అలా వెళ్తున్న వారిలో మీరు ఎంతమందిపై నిషేధం విధించగలరు?’ అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును షజాద్ ప్రశ్నించాడు.


ఇక పాక్‌ మీడియాపై కూడా షెజాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీఎస్ఎల్ ను ప్రమోట్ చేస్తున్నామని భ్రమలో పరువుతు తీస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. ‘కుశాల్‌ మెండిస్‌ పీఎస్‌ఎల్‌లో ఆడుతున్నాడు. అతడి దగ్గరికి వెళ్లి.. గతేడాది మీరు ఈ లీగ్‌ వదిలి ఐపీఎల్‌కు వెళ్లారు కదా! దాని గురించి మీ మాట్లాడండి?’ అని మనోళ్లు అడుగుతున్నారు. అసలు ఇవేం ప్రశ్నలు?. అలానే రిలీ రొసోవ్‌ దగ్గరికి వెళ్లి.. ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను పోల్చమంటారు. అతడు ఇప్పుడు పీఎల్ఎల్‌లో ఉన్నాడు కాబట్టి ఐపీఎల్‌ను ఎలా పొగడగలడు?. అందుకే దాటవేత ధోరణిలో ఏదేదో చెప్పాడు’ అని అహ్మద్‌ షెజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: రోహిత్ శర్మ గాయంపై కీలక అప్‌డేట్..

ఆ చిట్కాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాను: నూర్ అహ్మద్

Updated Date - Apr 15 , 2026 | 03:24 PM