ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టాడని హిట్టర్‌గా చూస్తారా?: రింకు సింగ్‌పై విమర్శలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 02:56 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. స్టార్ ప్లేయర్ రింకు సింగ్ కూడా సరైన ప్రదర్శన చేయకపోతుండటంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. కామెరూన్ గ్రీన్, రింకు సింగ్ లాంటి స్టార్ ప్లేయర్లు విఫలమవుతుండటంతో కేకేఆర్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ ప్లేయర్లు రాణించడం లేదు. అయితే 2024 ఐపీఎల్ సీజన్‌లో స్టార్ ప్లేయర్ రింకు సింగ్ ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడిని హిట్టర్‌గా భావించి ఫినిషర్‌గా కొనసాగిస్తున్నారు. తాజాగా రింకు కూడా ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రింకు సింగ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘ఎప్పుడో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడని రింకు సింగ్‌ను హిట్టర్‌గా భావిస్తున్నారా? అదే సరైంది కాదు. అతడు స్ట్రైక్ రొటేట్ చేయగలడు కానీ భారీ షాట్లు కొట్టేంత సామర్థ్యం లేదు. రింకును నంబర్ 5లో బ్యాటింగ్‌కు పంపడం సరైన వ్యూహం కాదు. అతడికి నంబర్ 7 స్థానం సరిపోతుంది. చివర్లో కొద్ది ఓవర్లలో పరుగులు చేయగలడు కానీ ఎక్కువ రన్‌రేట్ ఉన్నప్పుడు ఒత్తిడి గురై పరుగులు చేయడానికి ఇబ్బంది పడతాడు’ అని క్రిస్ శ్రీకాంత్ వెల్లడించాడు.
ఒక్కరు కూడా..
కేకేఆర్ బ్యాటింగ్ యూనిట్ పై క్రిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘యువ ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ గెలవాలనే ఉద్దేశంతో ఆడటం లేదు. ముఖ్యంగా ఓపెనర్ ఫిన్ అలెన్ నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతున్నాడు. ఒకే విధమైన బంతికి ప్రతి మ్యాచ్‌లోనూ ఔటై పెవిలియన్ చేరుతున్నాడు. అతడి బ్యాటింగ్‌లో మార్పు రాకపోతే.. అలెన్ స్థానంలో సీఫర్ట్‌కు అవకాశం దక్కుతుంది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కేకేఆర్ ఇంకా గెలుపు ఖాతా తెరవకపోవడం విడ్డూరం’ అని క్రిస్ శ్రీకాంత్ విమర్శించాడు.
ఇవి కూడా చదవండి:
అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్
ఆ చిట్కాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాను: నూర్ అహ్మద్