Share News

ఐపీఎల్ 2026: రోహిత్ శర్మ గాయంపై కీలక అప్‌డేట్..

ABN , Publish Date - Apr 15 , 2026 | 02:15 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మకు గాయమైన సంగతి తెలిసిందే. అతడి గాయంపై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఇది ముంబై ఇండియన్స్ అభిమానులకు గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు.

ఐపీఎల్ 2026: రోహిత్ శర్మ గాయంపై కీలక అప్‌డేట్..
Rohit Sharma injury

స్పోర్ట్స్ డెస్క్‌: ఏప్రిల్12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma Injury)కు గాయమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ 13 బంతుల్లో 19 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో 241 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 222 పరుగులకే పరిమితమైంది. ఇదే సమయంలో రోహిత్ గాయంపై ముంబై మేనేజ్‌మెంట్‌తో సహా అందరిలో ఆందోళన నెలకొంది. రోహిత్ గాయంపై తాజా అప్‌డేట్ వచ్చింది.


కండరాలు పట్టేయడంతో మైదానం వీడిన అతడికి.. వైద్యులు స్కానింగ్‌ తీశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ గాయానికి సంబంధించి మెడికల్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చీలిక లేదని తేలింది. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రేపు(గురువారం) పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడో? లేదో అనే దానిపై అనిశ్చితి నెలకొంది. గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో తొలుత అందరూ అనుకున్నట్లు మరిన్ని మ్యాచులకు మాత్రం దూరమయ్యే అవకాశం లేదు. ఇవాళ(బుధవారం) సాయంత్రానికి ఫిట్‌నెస్‌పై స్పష్టత రానుంది.


'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సమయంలో కండరాలు పట్టేయడంతో రోహిత్ మైదానం వీడాడు. స్కానింగ్‌లో ఎలాంటి సమస్య కనిపించలేదు. దీంతో మరిన్ని మ్యాచులకు దూరం అవుతాడనే ఊహాగానాలకు తెరపడింది. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు రోహిత్‌ ఆడేది లేనిది మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంది. అతడిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానైనా బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు’ అని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ జట్టు నాలుగు మ్యాచులు ఆడి ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే.


ఇవి కూడా చదవండి:

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

ఆ చిట్కాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాను: నూర్ అహ్మద్

Updated Date - Apr 15 , 2026 | 02:22 PM