ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరం!
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:36 PM
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో 241 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 222కే పరిమితమైంది. రోహిత్ శర్మ ఆర్సీబీపై 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు.
ఈ సీజన్‌లో ఎంఐ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు ఓడి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ లోటు ముంబైకి మరింత తలనొప్పిగా మారనుంది. కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడిన తర్వాత రోహిత్ శర్మ స్కానింగ్ తీయించుకున్న సంగతి తెలిసిందే. ఆ మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చీలిక లేదని తేలింది. గాయం మరీ పెద్దది కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 20న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేసిన రోహిత్, ఒక అర్ధ శతకం నమోదు చేశాడు. మంచి ఫామ్‌లో కనిపిస్తున్న సమయంలో గాయం బారిన పడటం జట్టుకు పెద్ద లోటుగా మారింది.
ఈ ఐపీఎల్ సీజన్‌ను గెలుపుతో ప్రారంభించిన ముంబై.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలో వైఫల్యం జట్టును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలోనూ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా స్టార్ పేసర్ బుమ్రా.. ఇప్పటి వరకు వికెట్ల ఖాతా తెరవకపోవడం గమనార్హం. అతనితో పాటు ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య ఉన్నప్పటికీ బౌలింగ్‌లో ప్రభావం చూపడం లేదు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే.
ఇవి కూడా చదవండి:
ధోని సూచనలతోనే నూర్ కాస్తా కోహి‘నూర్’గా మారాడు: సీఎస్కే బౌలింగ్ కోచ్
స్లో ఓవర్ రేట్: ప్లేయర్లకు కాదు.. అంపైర్లకు జరిమానా విధించాలి: ఎంసీసీ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్