స్లో ఓవర్ రేట్: ప్లేయర్లకు కాదు.. అంపైర్లకు జరిమానా విధించాలి: ఎంసీసీ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:23 PM
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌లు ఆలస్యంగా సాగడం సహజమే. మరీ ఆలస్యం అయితే మాత్రం స్లో ఓవర్ రేట్ అంటూ ఆయా జట్ల కెప్టెన్లపై మ్యాచ్ రిఫరీ జరిమానా విధిస్తారు. అయితే ఈ విషయంపై మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్ ఘాటుగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌లు ఆలస్యంగా సాగడం సహజమే. మరీ ఆలస్యం అయితే మాత్రం స్లో ఓవర్ రేట్ అంటూ ఆయా జట్ల కెప్టెన్లపై మ్యాచ్ రిఫరీ జరిమానా విధిస్తారు. తొలిసారికి రూ.12 లక్షలు, రెండోసారి అయితే కెప్టెన్‌కు రూ.24 లక్షలు, ఆటగాళ్లకు రూ.6 లక్షల చొప్పున ఫైన్ పడుతోంది. అదే మూడోసారి జరిగితే కెప్టెన్‌కు ఏకంగా రూ.30లక్షలు, ఒక డీమెరిట్ పాయింట్ జతవుతోంది. అయితే ఈ విషయంపై మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్ ఘాటుగా స్పందించారు. స్లో ఓవర్ రేట్‌కు కేవలం ప్లేయర్లను బాధ్యులను చేయడం సరికాదని.. అంపైర్లకూ ఇదే నిబంధన వర్తింపజేయాలని సూచించారు.
‘అంపైర్ల వల్లే మ్యాచ్‌లు ఆలస్యం అవుతున్నాయి. మ్యాచ్‌ను త్వరగా పూర్తి చేయించడం వారి బాధ్యత. మ్యాచ్‌ను చూస్తోన్న కోట్లాది మందికి ప్రతి బ్రేక్ ఓ ప్రచార అవకాశంగా మారింది. క్రికెట్ చట్టాల ప్రకారం.. హెచ్చరికలు, ఐదు పరుగుల పెనాల్టీలకు అనుమతి ఉంది. వాటిని అమలు చేయడానికీ అంపైర్లు సంకోచిస్తున్నారు. అందుకే నేనొక సూచన చేయాలనుకుంటున్నా.. స్లో ఓవర్ రేట్ ఎదురైన ప్రతిసారీ అంపైర్లకు జరిమానాలు విధించాలి. అప్పుడు కానీ మ్యాచ్‌లు వేగంగా జరగవు. మ్యాచ్‌కు ఎక్కువ ఆటంకాలు జరగడం వల్ల చూడాలనే ఆసక్తి తగ్గుతోంది. అదే ది హండ్రెడ్ లీగ్‌లో ఎప్పుడైతే వికెట్ పడుతుందో.. వెంటనే 60 సెకన్ల క్లాక్ స్టార్ట్ అవుతుంది. తర్వాత బ్యాటర్ రెడీగా ఉండాలి. లేకపోతే ఐదు పరుగుల పెనాల్టీ ఎదుర్కోవాల్సిందే. ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఉంటుందని తెలుసు. ప్లేయర్లూ ఎక్కువగా డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటిని తీసుకెళ్లే వారిలో ఎలాంటి తొందర కనిపించడం లేదు. అంపైర్లు కూడా చూసి చూడనట్టే ఉంటున్నారు’ అని ఫ్రేజర్ స్టీవార్ట్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్
ఆ చిట్కాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాను: నూర్ అహ్మద్