Share News

ఐపీఎల్ 2026: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన సీఎస్కే

ABN , Publish Date - May 10 , 2026 | 03:13 PM

ఐపీఎల్ 2026 మరో కీలక సమరానికి సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన సీఎస్కే.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎల్ఎస్‌జీ బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన సీఎస్కే
CSK vs LSG

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరో కీలక సమరానికి సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన సీఎస్కే.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎల్ఎస్‌జీ బ్యాటింగ్‌కు దిగనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సీఎస్కే.. ఈ పోరులో గెలిచి టాప్ 4లో చోటు దక్కించుకోవాలనే కసితో ఉంది. మరోవైపు బలమైన ఆర్సీబీని ఢీకొట్టిన ఎల్ఎస్‌జీ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే, పదింట్లో ఐదు గెలిచిన సీఎస్కే పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. పదింట్లో మూడు గెలిచిన లఖ్‌నవూ అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.


సీఎస్కే తుది జట్టు

రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, జెమీ ఓవర్టన్, అకీల్ హుస్సేన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: గుర్జాప్‌నీత్ సింగ్, ప్రశాంత్ వీర్, మ్యాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ మధ్వాల్


ఎల్ఎస్‌జీ తుది జట్టు

రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్‌రమ్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాద్ అహ్మద్, షమి, దిగ్వేశ్ సింగ్ రాఠి, ప్రిన్స్ యాదవ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ముకుల్ చౌదరి, ఆవేశ్ ఖాన్, అబ్దుల్ సమద్, మనిమారన్ సిద్ధార్థ్, మయాంక్ యాదవ్


ఇవి కూడా చదవండి:

కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చిన సంజు శాంసన్

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. ఫ్యాన్స్‌కు సీఎస్కే ప్రత్యేక సందేశం

Updated Date - May 10 , 2026 | 03:17 PM