Share News

ఐపీఎల్ 2026: 16 బంతుల్లో పూరన్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్ ముందు భారీ టార్గెట్

ABN , Publish Date - May 04 , 2026 | 09:30 PM

వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ముంబైకి 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: 16 బంతుల్లో పూరన్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్ ముందు భారీ టార్గెట్
MI vs LSG

ఇంటర్నెట్ డెస్క్: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ముంబైకి 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లఖ్‌నవూ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్(63) ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు మొత్తంగా 21 బంతుల్లో 8 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.


మిచెల్ మార్ష్(44; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హిమ్మత్ సింగ్(40*; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఐడెన్ మార్క్‌రమ్(31*; 25 బంతుల్లొ 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. జోస్ ఇంగ్లిష్(13), రిషబ్ పంత్(15), రఘువంశీ(11) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2, ఘజన్‌ఫర్ 1, రఘు శర్మ 1, విల్ జాక్స్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్

ఓడిపోయే మ్యాచ్‌ గెలవడానికి అతడే కారణం: శుభ్‌మన్ గిల్

Updated Date - May 04 , 2026 | 09:31 PM