Share News

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్.. లఖ్‌నవూ విజయ లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - Apr 19 , 2026 | 09:29 PM

ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేశారు. ఎల్ఎస్‌జీకి 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్.. లఖ్‌నవూ విజయ లక్ష్యం ఎంతంటే?
PBKS vs LSG

ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేశారు. ఎల్ఎస్‌జీకి 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(93; 37 బంతుల్లో 9 సిక్స్‌లు, 4 ఫోర్లు), కూపర్ కానోలి(87; 46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 80 బంతుల్లో ఏకంగా 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పంజాబ్ బ్యాటర్ల బీభత్సానికి లఖ్‌నవూ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు.


ప్రియాంశ్ ఆర్య(93) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్(0) విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్(5), నేహాల్ వధేరా(13) నిరాశపర్చారు. ఆఖర్లో స్టోయినిస్(29), శశాంక్ సింగ్(17) మెరుపులు మెరిపించారు. యాన్సెన్(1*) నాటౌట్‌గా నిలిచాడు. లఖ్‌నవూ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2, సిద్ధార్థ్ 2, షమి 1, మొహ్సిన్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఎట్టకేలకు.. తొలి విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్

ఐపీఎల్ 2026: ఆర్ఆర్‌పై చెలరేగిన బౌలర్లు.. కేకేఆర్ టార్గెట్ 156

Updated Date - Apr 19 , 2026 | 09:29 PM