Share News

ఆయుశ్ మాత్రేకు గాయం.. మూడు వారాలు ఆటకు దూరం!

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:59 PM

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే గాయంతో జట్టుకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఆయుశ్ గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.

ఆయుశ్ మాత్రేకు గాయం.. మూడు వారాలు ఆటకు దూరం!
Ayush Mhatre

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే గాయంతో జట్టుకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఆయుశ్ గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. డబుల్ కోసం పరిగెత్తే సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. అంతకుముందే కాలుకు పట్టీ వేసుకుని ఉన్నాడు. అయినప్పటికీ బ్యాటింగ్‌కు దిగాడు. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ సమయంలో ఫిజియోల సాయం తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ తర్వాతి బంతికే ఆయుశ్ ఔటై పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న బ్యాటర్ గాయం బారిన పడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ గాయం కారణంగా ఆయుశ్ మాత్రే సుమారు మూడు వారాల పాటు జట్టుకు దూరం కానున్నట్టు సమాచారం. ముంబైలో జరగనున్న టెస్టుల అనంతరం గాయం తీవ్రతపై పూర్తి స్పష్టత రానుంది. అయితే ప్రస్తుతం నొప్పి లేకుండా నడవగలుగుతున్నాడని సమాచారం. దీంతో టోర్నమెంట్ చివరి దశలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఎస్కే వర్గాలు వెల్లడించాయి.


ఇదిలా ఉండగా సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ.. ఆయుశ్ గాయంపై స్పందించాడు. ‘ఇది కండరాల గాయం అనిపిస్తోంది. గాయం తీవ్రత ఏంటనేది స్కానింగ్ తీస్తేగానీ చెప్పలేం. మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్ గాయపడటం జట్టుకు పెద్ద లోటు’ అని తెలిపారు. ఇప్పటికే జట్టులో కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ మాత్రే గాయం సీఎస్కే ప్లే ఆఫ్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా చెన్నై ఆడిన ఆరు మ్యాచుల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్

చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవివత్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం!

Updated Date - Apr 19 , 2026 | 07:08 PM