Share News

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్

ABN , Publish Date - Apr 19 , 2026 | 03:14 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్ఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
KKR vs RR

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్ఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో కేకేఆర్ ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరవలేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో ఒకటి వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన ఐదింట్లోనూ ఓడింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచులోనైనా ఆధిపత్యం ప్రదర్శించి విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆఖరిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘోర పరాభవం పాలైన ఆర్ఆర్.. ఈ మ్యాచ్‌లో గెలవాలన్న కసితో ఉంది.


రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు

వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రోన్ హిట్‌మేయర్, డొనొవాన్ ఫెర్రీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, బ్రిజేశ్ శర్మ, రవి బిష్ణోయ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: సందీప్ శర్మ, శుభమ్ దూబె, ప్రిటోరియస్, రవి సింగ్, యశ్ పంజా


కేకేఆర్ తుది జట్టు

అజింక్య రహానె(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: మనిశ్ పాండే, ఫిన్ అలెన్, రఘువంశీ, తేజస్వి సింగ్, నవదీప్ సైనీ


ఇవి కూడా చదవండి:

సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. సీఎస్కే చెత్త రికార్డు నమోదు

మా విజయానికి కారణం వారే: ఇషాన్ కిషన్

Updated Date - Apr 19 , 2026 | 03:14 PM