Share News

ఐపీఎల్ 2026: ఆర్ఆర్‌పై చెలరేగిన బౌలర్లు.. కేకేఆర్ టార్గెట్ 156

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:31 PM

సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు అదరగొట్టారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్లపై కేకేఆర్ బౌలర్లు విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: ఆర్ఆర్‌పై చెలరేగిన బౌలర్లు.. కేకేఆర్ టార్గెట్ 156
KKR vs RR

ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు అదరగొట్టారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్లపై కేకేఆర్ బౌలర్లు విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కేకేఆర్‌కు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి చెరో మూడు వికెట్లతో చెలరేగిన వేళ.. ఆర్ఆర్ స్వల్ప స్కోరు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ(46) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.


వైభవ్ సూర్యవంశీ(46; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. యశస్వి జైస్వాల్(39; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా వెనువెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. ధ్రువ్ జురెల్(5), రియాన్ పరాగ్(12), ఫెర్రీరా(7), రవీంద్ర జడేజా(9), జోఫ్రా ఆర్చర్(8), రవి బిష్ణోయ్(0) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బ్రిజేశ్ శర్మ(1*) నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, కార్తిక్ త్యాగి 3, సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్

చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవివత్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం!

Updated Date - Apr 19 , 2026 | 05:31 PM