ఐపీఎల్ 2026: ఎట్టకేలకు.. తొలి విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్
ABN , Publish Date - Apr 19 , 2026 | 07:32 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్ఆర్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే కేకేఆర్ బ్యాటర్లు ఛేదించారు. 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేశారు. టాపార్టర్ విఫలమైనప్పటికీ.. స్టార్ బ్యాటర్ రింకు సింగ్(53*) హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనుకుల్ రాయ్(29*)తో కలిసి ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కేకేఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి ఆర్ఆర్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. అలవోకగా లక్ష్యాన్ని బాదేయొచ్చు అనుకుంటున్న తరుణంలో టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. టిమ్ సీఫర్ట్(0), కెప్టెన అజింక్య రహానె(0), రఘువంశీ(10), రమన్‌దీప్ సింగ్(10) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. గ్రీన్(27), పావెల్(23) పర్వాలేదనిపించారు. ఆఖరిలో వచ్చిన రింకు సింగ్(53*) అదరగొట్టాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. అనుకుల్ రాయ్(29*) రాణించాడు. దీంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది. ఆర్ఆర్ బౌలర్లలో రవీంద్ర జడేజా 2, ఆర్చర్ 1, బర్గర్ 1, బిష్ణోయ్ 1, యశ్ రాజ్ 1 వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి చెరో మూడు వికెట్లతో చెలరేగిన వేళ.. ఆర్ఆర్ స్వల్ప స్కోరు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ(46) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ(46; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. యశస్వి జైస్వాల్(39; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా వెనువెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. ధ్రువ్ జురెల్(5), రియాన్ పరాగ్(12), ఫెర్రీరా(7), రవీంద్ర జడేజా(9), జోఫ్రా ఆర్చర్(8), రవి బిష్ణోయ్(0) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బ్రిజేశ్ శర్మ(1*) నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, కార్తిక్ త్యాగి 3, సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవివత్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం!