Share News

దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. టీమిండియా ఘోర ఓటమి

ABN , Publish Date - Apr 19 , 2026 | 08:55 PM

టీమిండియా మహిళా జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. డర్బన్ వేదికగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా మహిళలు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో ఆతిధ్య జట్టు 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. టీమిండియా ఘోర ఓటమి
India Women vs South Africa Women

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళా జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. డర్బన్ వేదికగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా మహిళలు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో ఆతిధ్య జట్టు 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ షెఫాలి వర్మ(57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. 148 పరుగుల లక్ష్యం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా మహిళలు అదరగొట్టారు. కేవలం 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆట ముగించారు.


కెప్టెన్ లారా వోల్వార్ట్(54), లూస్(57) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బ్రెట్స్(20*), అన్నెరీ డెర్క్‌సన్(12*) నాటౌట్‌గా నిలిచారు. సఫారీ ఓపెనర్ల ధాటికి టీమిండియా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. వికెట్లు తీయడానికి బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. పడిన ఈ రెండు వికెట్లను శ్రేయాంక పాటిల్ తీసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 147 పరుగులకు ఆలౌటైంది. షెఫాలి వర్మ(57) రాణించింది. స్మృతి మంధాన(12), జెమీమా(2), అనుష్క శర్మ(28), హర్మన్ ప్రీత్(12), దీప్తి శర్మ(1), రిచా ఘోష్(3), అరుంధతి రెడ్డి(14), శ్రేయాంక పాటిల్(0), క్రాంతి గౌడ్(4) వెనువెంటనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రొటీస్ బౌలర్లలో తుమి సెఖుఖునే 3, కాకా 3, నందినే డి క్లర్క్ 1, మలాబా1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఎట్టకేలకు.. తొలి విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్

ఐపీఎల్ 2026: ఆర్ఆర్‌పై చెలరేగిన బౌలర్లు.. కేకేఆర్ టార్గెట్ 156

Updated Date - Apr 19 , 2026 | 08:56 PM