'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ
ABN , Publish Date - Apr 16 , 2026 | 10:46 AM
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. లఖ్‌నవూపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన జోష్ హేజిల్‌వుడ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు వరించింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం బయటపడింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్2026లో నిన్న(బుధవారం) జరిగిన మ్యాచ్ లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. దీంతో ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన జోష్ హేజిల్‌వుడ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు వరించింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం బయటపడింది. మరి.. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..
ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున నాలుగు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ప్లేయర్లంతా విదేశీ క్రికెటర్లే కావడం గమనార్హం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జాకబ్ డఫీ (న్యూజిలాండ్), చెన్నై సూపర్ కింగ్స్‌పై టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా), ముంబై ఇండియన్స్‌పై ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్, లఖ్‌నవూపై జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. 2025 నుంచి బెంగళూరు తరఫున 10 మంది వేరువేరు ఆటగాళ్లు ఈ అవార్డులను అందుకొన్నారు. ఐపీఎల్‌లో మరే జట్టులోనూ ఇలాంటిది చోటుచేసుకోలేదు.
ఇక లఖ్‌నవూ మ్యాచ్‌లో జోష్ హేజిల్‌వుడ్ చక్కడ బౌలింగ్ వేశాడు. నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్న సందర్భంగా జోష్ మాట్లాడుతూ.. వరుసగా తాము నాలుగు మ్యాచులు గెలిచామని, వారి షెడ్యూల్ కూడా బాగుందని తెలిపాడు. అలానే మున్ముందూ ఇదే వ్యూహం కొనసాగిస్తామని అనుకుంటున్నామని జోష్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
వచ్చేసింది యువరాణి.. క్యాండిడేట్స్ చెస్ విజేత వైశాలి