Share News

ఇది చరిత్రాత్మక అడుగు: ప్రధాని మోదీ

ABN , Publish Date - Apr 16 , 2026 | 10:12 AM

చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ అమలు దిశగా కేంద్రం నేడు పార్లమెంటులో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇది చరిత్రాత్మక ముందడుగు అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.

ఇది చరిత్రాత్మక అడుగు: ప్రధాని మోదీ
PM Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: చట్టసభల్లో మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం మరికాసేపట్లో మూడు కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత దిశగా నేడు దేశం చరిత్రాత్మక ముందడుగు వేయబోతోందని అన్నారు. భారత దేశ మహిళలపై గౌరవంతో ఈ దిశగా సాగుతున్నామని అన్నారు. తల్లులకు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి మనం ఇచ్చే గౌరవమని వ్యాఖ్యానించారు. మహిళల గొప్పదనాన్ని చాటిచేప్పే శ్లోకాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు.


ఈ బిల్లులకు చట్టరూపం ఇచ్చేందుకు పార్లమెంటు నేటి నుంచీ మూడు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానున్న విషయం తెలిసిందే. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్ఠంగా 850కు పెంచేలా ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెడుతోంది. సీట్ల తుది సంఖ్యను మాత్రం డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించనుంది. ఈ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభిస్తే 2029 నుంచీ ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అయితే, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల కేటాయింపుతో తమకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.


ఈ వార్తలనూ చదవండి:

వాణిజ్య ఒప్పందంపై చర్చలకు వచ్చేవారం అమెరికాకు భారత బృందం

బిహార్‌లో తొలి బీజేపీ సీఎంగా..సమ్రాట్‌ చౌదరి ప్రమాణస్వీకారం

Updated Date - Apr 16 , 2026 | 10:44 AM